ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో వివిధ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే మంగళవారం (అక్టోబర్ 1, 2019)న దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ను డాక్టర్ వినోద్‌కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. లా విభాగంలో ఆరు పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందులో సైబర్ లా, టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్ లా, ఇన్‌సాల్వెన్సీ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మోడర్న్ కార్పొరేట్ లా, ఐప్లెడ్ హ్యూమన్ రైట్స్ విభాగాల్లో ఒక సంవత్సరం పీజీ డిప్లొమా కోర్సులను అందించనున్నట్టు పేర్కొన్నారు.
అర్హత:
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.