స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సెస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు తప్పకుండ ఓటీఆర్(వన్ టైం రిజిస్ట్రేషన్) చేసుకోవాలని సూచించింది. ఓటీఆర్ చేసుకోని విద్యార్థులు ఎస్సెస్సీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, జనరల్ డ్యూటీ, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఇలా ఏ పరీక్షలకు కూడా అప్లై చేసుకోలేరని సూచిందింది. ఎస్సెస్సీ పరిధిలో జరిగే ఏ పరీక్షకు అప్లై చేసుకోవాలన్నా ముందుగా అభ్యర్థులు ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాలిని ప్రకటించింది.
ఎస్‌ఎస్సీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి:
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ssc.gov.in లోకి వెళ్ళాలి.
తరువాత లాగిన్/రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
తరువాత “రిజిస్టర్” బటన్ పై క్లిక్ చేయాలి.
అక్కడ పేరు, ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ నంబర్ వివరాలు ఎంటర్ చేయాలి.
కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి.
తరువాత మరిన్ని వివరాలను ఎంటర్ చేసి డిక్లరేషన్ పై క్లిక్ చేయాలి.
ఈ ప్రక్రియ పూర్తవగానే మీరు ఎస్సెస్పీ పరిధిలో జరిగే అన్ని పరీక్షల కోసం విజయవంతంగా రిజిస్టర్ అవుతారు.
ఎస్‌ఎస్సీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన ధ్రువపత్రాలు:
మొబైల్ నంబర్
ఈమెయిల్ ఐడీ
ఆధార్/ పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ సర్టిఫికెట్లు, జనన ధృవీకరణ పత్రం, యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ పాస్‌బుక్, అద్దె ఒప్పందం (వీటిలో ఏదైనా ఒకటి)
10వ తరగతి పరీక్షలో బోర్డు నంబర్, ఉత్తీర్ణత సాధించిన సమాచారం
మీ అత్యధిక విద్యార్హత సమాచారం
వికలాంగత్వ ధృవీకరణ పత్రం, నంబర్ (ఏదైనా ఉంటే,)
కుల ధృవీకరణ పత్రం
ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే? వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లో చిన్న తప్పులు ఉన్నా ఎస్‌ఎస్సీ మీ అభ్యర్థిత్వాన్ని స్వీకరించదు.