Pawan Hans Recruitment: ట్రైనింగ్ లోనే 50,000 ఇచ్చే జాబ్.. బీటెక్, బీఈ వాళ్లకు బంపర్ ఆఫర్.. వెంటనే అప్లై చేసుకోండి

Pawan Hans Recruitment: పవన్ హన్స్ తమ సంస్థలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Pawan Hans company has released a notification for 33 posts.

బి.టెక్/బి.ఇ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్. పవన్ హన్స్ తమ సంస్థలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ది పవన్ హన్స్ అధికారిక వెబ్ సైట్ pawanhans.co.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణత, బి.టెక్/బి.ఇ చదువును పూర్తి చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి:
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలు పైబడకూడదు. జనరల్ మేనేజర్ పోస్టులకు 50 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.295 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwBD అభ్యర్థులకు ఎలాంటి రుసుము లేదు.

వేతన వివరాలు:
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 జీతం ఇస్తారు.
మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.1 లక్ష నుంచి రూ.2.6 లక్షల వరకు జీతం ఇస్తారు.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ pawanhans.co.in ను సంప్రదించవచ్చు