PG Scholarship Scheme: ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ స్కాలర్షిప్స్ పై చదువుకునే విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గుడ్ న్యూస్ చెప్పింది. అకడమిక్ ఇయర్ 2025-26కి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG Scholarship Scheme) స్కాలర్‌షిప్ పథకంపై అధికారిక ప్రకటన చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://pgscholarship.aicte.gov.in/ నుంచి డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒరిజినల్ డాక్యుమెంట్లను మాత్రమే స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
GATE/CEED స్కోర్ కార్డ్ కాపీలను కూడా అప్‌లోడ్ చేయాలి.
ఆధార్‌తో అనుసంధానమై బ్యాంక్ ఖాతాను సమర్పించాల్సి ఉంటుంది.
పీజీ స్కాలర్‌షిప్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) ద్వారా ఆధార్ ఆధారిత బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ (ABPS) మోడ్‌లో మాత్రమే పంపిణీ జరుగుతుంది.
నో-ఫ్రిల్, జన్ ధన్, పరిమితులు ఉన్న బ్యాంక్ ఖాతాలు, జాయింట్ ఖాతాలు ఈ పథకానికి అర్హత ఉండదు. కేవలం వ్యక్తిగత ఖాతాను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
ఒరిజినల్ ఆధార్ కార్డు యొక్క స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాలి.
SC/ST, EWS, OBC నాన్-క్రీమీ లేయర్ (NCL) అభ్యర్థులు తమ చెల్లుబాటు అయ్యే కేటగిరీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి. అది కూడా ఒక సంవత్సరం లోపు తీసుకున్నదే అయ్యుండాలి.
విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, అడ్మిషన్ తేదీ, కోర్సు ప్రారంభం, పూర్తయ్యే తేదీలను సరి చూసుకోవాలి.
విద్యార్థులు డిసెంబర్ 15, 2025 లోపు తమ వివరాలను AICTE వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.