professor jayashankar telangana agricultural university
Telangana Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉగ్యోగల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ వార్డెన్స్ కింద 10 మంది మహిళలను, 10 మంది పురుషులను ఎంపిక చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ రిక్రూట్ మెంట్ జరుగనుంది. జూన్ 20న నాల్డెజ్ మేనేజ్మెంట్ సెంటర్, పీజేటీఏయూ క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ నందు ఈ ఇంటర్వ్యూ జరుగనుంది. ఈమేరకు యూనివర్శిటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. Also Read: ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.. మరిన్ని వివరాలు మీకోసం
అర్హతలు: ఎంఏ సోషియాలజీ లేదా ఎంఏ సోషల్ వర్క్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హానర్స్(కమ్యూనిటీ సైన్స్) పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగనుంది.
పని చేయవలసిన ప్రాంతాలు: హైదరాబాద్, రాజేంద్రనగర్, అశ్వరావుపేట, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, పాలెం, కంది, రుద్రూర్, ఆదిలాబాద్.
జీతం వివరాలు: ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్తలకు నెలకు రూ. 35 వేల జీతం ఉంటుంది.
ఇంటర్వ్యులకు వచ్చే అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలను జిరాక్స్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు కాపీలు తీసుకురావాలి. అప్లికేషన్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు కూడా ఉండాలి. మరిన్ని సందేహాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.pjtau.edu.in/index.html ను సంప్రదించాలి.