PM Yashasvi Scholarship: పేద విద్యార్థుల‌కు రూ.75 వేల స్కాలర్‌షిప్‌.. పీఎం యశస్వి స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం

పీఎం యశస్వి స్కాలర్షిప్ స్కీం(PM Yashasvi Scholarship) కింద ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీంలో భాగంగా

PM Yashasvi Scholarship 2025 Notification Released

PM Yashasvi Scholarship: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పీఎం యశస్వి స్కాలర్షిప్ స్కీం కింద ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో గుర్తింపు పొందిన పాఠశాల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్ధులకు ప్రతీ ఏటా రూ.75 వేల వరకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. అలాగే 11, 12వ తరగలు చదువుతున్న విద్యార్థులకు ప్రతీ ఏటా రూ.1,25,000 వరకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం సంవత్సరానికి గాను పీఎం యశస్వి స్కాలర్షిప్(PM Yashasvi Scholarship) 2025 నోటిఫికేషన్ ను విడుదల అయ్యింది. కాబట్టి, అర్హులైన విద్యార్థులు ఈ స్కీం కోసం అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.

IB Recruitment 2025: డిగ్రీ పాస్ అయితే చాలు.. జీతం రూ.81వేలు.. ఐబీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

అర్హ‌త‌లు:
దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించి ఉండకూడదు.

ఎంపిక విధానం :
పీఎం యశస్వి ఎంట్రన్స్ టెస్ట్ 2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులను మాత్రమే ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ:
విద్యార్ధులు ఆగస్టు 31వ తేదీ లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.