Railway Jobs
Railway TTE Post : ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? భారతీయ రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది రైల్వేలలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలు కంటారు. మీరు కూడా చాలా కాలంగా రైల్వే ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.
రైల్వేలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌గా ఉద్యోగం కోసం మీరు 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఈ పోస్టు కోసం ముందుగా ప్రాథమిక పరీక్ష రాయల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, శారరీక దారుడ్య పరీక్ష వంటివి ఉంటాయి. రైల్వేటీ టీటీఈ పోస్టుకు అర్హతకు ఏమి ఉండాలి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? జీతం ఎంత అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీటీఈ ఉద్యోగానికి అర్హతలు :
టీటీఈ ఉద్యోగం కోసం, అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. కొన్ని ఉద్యోగ పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అవసరం కావచ్చు. ఈ పోస్టుకు వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. అయితే, OBC, SC/ST, ఇతర రిజర్వ్డ్ కేటగిరీలకు కొన్ని సడలింపులు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ ఇలా :
టీటీఈ నియామక ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహిస్తుంది. ఇందులో అనేక దశలు ఉంటాయి. ముందుగా దరఖాస్తును అధికారిక RRB వెబ్‌సైట్‌ల ద్వారా సమర్పించాలి. ఆ తరువాత, ప్రాథమిక, ప్రధాన పరీక్షలు జరుగుతాయి.
ఆ తరువాత ఆప్టిట్యూడ్ టెస్ట్ (పరీక్షకు వర్తిస్తే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ కూడా ఉంటాయి. టీటీఈ పోస్ట్ ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ (నాన్ టెక్ కేటగిరీ) పరీక్ష కిందకు వస్తుంది. ఈ పరీక్షలో సీబీటీ 1 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)లో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, సీబీటీ 2లో మరిన్ని ఇతర ప్రశ్నలు ఉంటాయి.
TTE ఉద్యోగ పోస్టుకు జీతం ఎంతంటే? :
7వ వేతన సంఘం లెవల్ 3 ప్రకారం.. టీటీఈ ప్రారంభ కనీస వేతనం నెలకు దాదాపు రూ. 21,700 ఉంటుంది. రైల్వేలో పోస్టును బట్టి గ్రేడ్ పే రూ.1,900 నుంచి రూ.2వేల వరకు ఉంటుంది. దాంతో పాటు, డియర్‌నెస్ అలవెన్స్ (కనీస జీతంలో 50శాతం వరకు), ఇంటి అద్దె అలవెన్స్ (నగర వర్గాన్ని బట్టి 10శాతం నుంచి 30 శాతం వరకు), ప్రయాణ భత్యం, వైద్య సౌకర్యాలు, పెన్షన్ పథకాలు, రైల్వే పాస్ వంటి అదనపు అలవెన్సుల ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
ఎన్‌పీఎస్ (NPS) తగ్గింపులను కలుపుకొని ప్రారంభ జీతం నెలకు రూ. 36వేల నుంచి రూ. 45వేల వరకు ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మరింత జీతం పెంచుకోవచ్చు. సీనియర్ టీటీఈకి రూ.2,800 గ్రేడ్ పే, రూ.50వేల నుంచి రూ. 60వేల మధ్య జీతం లభిస్తుంది.
ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (TTI)కి రూ.4,200 గ్రేడ్ పే, రూ.70వేల కన్నా ఎక్కువ జీతం, చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ (CTI)కి రూ.4,600 గ్రేడ్ పే, రూ.80వేల కన్నా ఎక్కువ జీతం లభిస్తుంది. ఇది కాకుండా, టీటీఈ తనకు, తన కుటుంబానికి ఉచిత లేదా రాయితీ రైలు టేబుల్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. వారికి పెన్షన్, వైద్య సౌకర్యంతో పాటు ప్రభుత్వ గృహ సౌకర్యం కూడా లభిస్తుంది.
రైల్వేలో ఉద్యోగం సాధించాలంటే ముందుగా ప్రాథమిక పరీక్షలో పాసవ్వాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ, శారీరక పరీక్షతో పాటు ఆర్‌ఆర్‌బీ నిర్వహించే ప్రధాన పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలి.