SAIL Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 ట్రైనీ మెడికల్ అటెండెంట్ పోస్టుల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ/ఫార్మసీలో డిప్లొమా, బీఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ, బీబీఏ, పీజీ డిప్లొమా, బీపీటీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.

Steel Authority of India

SAIL Recruitment : భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 ట్రైనీ మెడికల్ అటెండెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి మెడికల్ అటెండెంట్ ట్రైనింగ్‌ పోస్టులు 100 , రేడియోగ్రాఫర్ ట్రైనింగ్‌ పోస్టులు 3, ఫార్మసిస్ట్ ట్రైనింగ్‌ పోస్టులు 3, క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనింగ్‌ పోస్టులు 20, అధునాతన ప్రత్యేక నర్సింగ్ ట్రైనింగ్‌ పోస్టులు 40, డేటా ఎంట్రీ ఆపరేటర్/ మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ట్రైనింగ్‌ణ పోస్టులు 6, మెడికల్ ల్యాబ్. టెక్నీషియన్ ట్రైనింగ్‌ పోస్టులు 10, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్‌ పోస్టులు 10, అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనింగ్‌ పోస్టులు 5, ఫిజియోథెరపీ ట్రైనింగ్‌ పోస్టులు 3 ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ/ఫార్మసీలో డిప్లొమా, బీఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ, బీబీఏ, పీజీ డిప్లొమా, బీపీటీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.9,000ల నుంచి రూ.17,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 8, 2022వ తేదీ వరకు దరఖాస్తుకు ఆఖరి గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sail.co.in/ పరిశీలించగలరు.