SBI JOBS
SBI Recruitment : భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా పలు సర్కిళ్లలో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్ లో 225 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత ప్రాంతీయ భాష వచ్చినవారు ఏ రాష్ట్రంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులే. అభ్యర్ధుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 27, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/ పరిశీలించగలరు.