ANM Recruitment : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము కింద రూ. 500, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ తదితర కేటగిరీలకు చెందిన వారికి ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి.

Telangana ANM Recruitment

ANM Recruitment : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(ఏఎన్‌ఎం)ఫిమేల్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1520 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : AAI Recruitment : ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) ట్రైనింగ్‌ కోర్సు లేదా ఇంటర్‌లో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) శిక్షణ కోర్సు పాసై ఉండాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర నర్సెస్‌ అండ్‌ మిడ్‌ వైవ్స్‌ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. వీటితోపాటుగా ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లినికల్‌ ట్రైనింగ్‌ లేదంటే గుర్తించిన ఆస్పత్రుల్లో ఏడాది అప్రెంటిషిప్‌ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి.

READ ALSO : Walking : మోకాలి నొప్పులతో బాధపడేవారు వాకింగ్ చెయ్యెచ్చా ?

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము కింద రూ. 500, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌ తదితర కేటగిరీలకు చెందిన వారికి ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తులు స్వీకరణ ఆగస్టు 25, 2023 నుండి ప్రారంభం అవుతుంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ సెప్టెంబర్‌ 19,2023 తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://mhsrb.telangana.gov.in/ పరిశీలించగలరు.