DRDO Recruitment : డిఫెన్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఐమరత్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత స్పెసలైజేషన్‌లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

DRDO Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలోని రిసెర్చ్‌ సెంటర్‌ ఐమరత్‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Prevent Heart Attack : గుండెపోటును నివారించాలంటే ముందుగా ప్రమాద కారకాలను తెలుసుకోండి !

భర్తీ చేయనున్న ఖాళీల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు (30), టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) ఖాళీలు (30), ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ) ఖాళీలు (90) ఖాళీలు ఉన్నాయి. ఆయా ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత స్పెసలైజేషన్‌లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

READ ALSO : Brain Tumor Risk : 5 ఉత్తమ ఆహారాలతో మెదడు కణితి ప్రమాదాన్ని నివారించండి !

అభ్యర్థులను ఎంపికకు సంబంధించి అకడమిక్ మెరిట్,రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు స్టైపండ్‌ చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.drdo.gov.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు