Faculty Recruitment in NIT : ఏపీ‌ నిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన చేస్తుండాలి. లేదంటే పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

Opportunities

Faculty Recruitment in NIT : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ)లో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Glutathione : చర్మ అందానికి గ్లూటాతియోన్ ను ఇంజెక్షన్ గా తీసుకునేకంటే ఆహారాల రూపంలో తీసుకోవటం మేలా ?

బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్‌ మేనేజ్‌మెంట్, సైన్సెస్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : 28 Years After Job : దరఖాస్తు చేసిన 28 ఏళ్లకు ఉద్యోగం.. పోస్టల్ అసిస్టెంట్ గా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశం

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన చేస్తుండాలి. లేదంటే పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. అకడమిక్ మెరిట్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైన వారికి నెల వేతనంగా జీతం: రూ.70,900. చెల్లిస్తారు.

READ ALSO :Cardiac Arrest : కార్డియాక్ అరెస్ట్ ముందస్తు సంకేతాలపై అవగాహన తప్పనిసరా ?

దరఖాస్తు ఫీజుగా రూ.1000.నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 13.11.2023గా నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేదిగా 20.11.2023 ప్రకటించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్, కడకట్ల, తాడేపల్లిగూడెం – 534101, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nitandhra.ac.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు