Andhra Pradesh Civil Supplies Corporation
AP Civil Supplies Recruitment : ఎపి సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిడెట్ కాకినాడ కార్యాలయం రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన సిబ్బంది నియామకం చేపట్టనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి ఈ నియామకాలు చేపట్టనున్నారు.
READ ALSO : Green Gram Dal : గుండె ఆరోగ్యానికి మేలు చేసే పెసరపప్పు !
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 825 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ 275 ఖాళీలు, హెల్పర్ 275 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ 275 ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Sunflower Cultivation : ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ(అగ్రికల్చర్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ), బీఎస్సీ(బీజడీసీ), బీఎస్సీ(లైఫ్ సైన్సెస్), డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణు లై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు పోస్టును బట్టి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
READ ALSO : Papaya Varieties : మేలైన బొప్పాయి రకాలు.. సాగు యాజమాన్యం
అభ్యర్ధుల ఎంపిక అకడమిక్ మార్కులు, పని అనుభవం , అధారంగా ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రతులను రిజిస్టర్ పోస్టులో డిస్ట్రిక్ సివిల్ సప్లైస్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పోరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా సెప్టెంబర్ 2, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://eastgodavari.ap.gov.in/ పరిశీలించగలరు.