BHEL Recruitment : భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ లో ఇంజనీర్‌ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీ

పోస్టును బట్టి మెకానికల్‌,ఎలక్ట్రికల్‌,సివిల్‌,కెమికల్‌ విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Bharat Heavy Electricals Limited

BHEL Recruitment : భారత ప్రభుత్వానికి చెందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (బీహెచ్ ఈ ఎల్ )లో ఇంజనీర్‌ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి మెకానికల్ పోస్టులు 30, ఎలక్ట్రికల్ పోస్టులు 15, సివిల్ పోస్టులు 40, కెమికల్ పోస్టులు 10, HR పోస్టులు 10, ఫైనాన్స్‌ పోస్టులు 20, IT/కంప్యూటర్ సైన్స్ పోస్టులు 20, మెటలర్జీ ఇంజినీర్ పోస్టులు 5 ఖాళీలు ఉన్నాయి.

పోస్టును బట్టి మెకానికల్‌,ఎలక్ట్రికల్‌,సివిల్‌,కెమికల్‌ విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 4, 2022వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 31, నవంబర్‌ 1, 2 తేదీల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ50,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bhelpssr.co.in/ పరిశీలించగలరు.