BPNL Recruitment : భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

భర్తీ చేయనున్న ఖాళీల్లో సర్వే ఇన్‌ఛార్జ్ 574 పోస్టులు, సర్వేయర్ 2870 పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టుల ఆధారంగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి.

Recruitment of job vacancies

BPNL Recruitment : కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్ధలో ఉన్న మొత్తం 3444 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా సర్వే ఇన్‌ఛార్జ్ , సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Munaga Nursery : మునగ నర్సరీతో లాభాల బాట.. ఒక సారి నాటితే 3 సంవత్సరాల పాటు దిగుబడి

భర్తీ చేయనున్న ఖాళీల్లో సర్వే ఇన్‌ఛార్జ్ 574 పోస్టులు, సర్వేయర్ 2870 పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టుల ఆధారంగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి.

READ ALSO : Kharif Crops : ఖరీఫ్ పంటలకు.. భూములు ఏవిధంగా సిద్ధం చేయాలంటే?

రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. సర్వే ఇన్ ఛార్జ్ కు నెలకు 24,000 వేతనం, సర్వేయర్ కు నెలకు 20,000 ప్రారంభ వేతనంగా నిర్ణయించారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి 5 జూలై 2023 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://pay.bharatiyapashupalan.com/ పరిశీలించగలరు.