NLC Job Vacancies : కేంద్రప్రభుత్వరంగ సంస్ధ నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు చెల్లిస్తారు.

NLC Job Vacancies :

NLC Job Vacancies : భారత ప్రభుత్వరంగానికి చెందిన హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 401 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టుల వివరాలకు సంబంధించి ట్రైనీ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 136, ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 41, ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు: 108, ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టులు: 99, ట్రైనీ ఆఫీసర్ (హెచ్‌ఆర్‌) పోస్టులు: 14, ట్రైనీ ఆఫీసర్ (లా) పోస్టులు: 3 ఖాళీలు ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 25, 2023వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జనవరి 5, 2023 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; nlcindia.in పరిశీలించగలరు.