HAL Recruitment
HAL Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 185 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డిజైన్ ట్రైనీ, మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Rare And Strange fruits : పోషకాల మెండు .. ప్రపపంచలోనే విచిత్రమైన,ఆశ్చర్యపరిచే పండ్లు,వాటి విశేషాలు
విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే డిజైన్ ట్రైనీ (95), మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) (90) ఖాళీలు ఉన్నాయి. ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ B.Tech/ BE పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు.
READ ALSO : Falling Dreams : ఎత్తునుంచి పడిపోతున్నట్లు కలలు వస్తున్నాయా? కారణం ఏంటంటే…
రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 22-08-2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://hal-india.co.in/ పరిశీలించగలరు.