HPCL Careers
HPCL Careers : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబయిలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 276 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, కెమికల్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్, లా ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్, తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక కు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ తదితరాల ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు.
READ ALSO : Sweet Potato Cultivation : ఖరీఫ్ పంటగా చిలగడదుంప సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేది సెప్టెంబరు 18 , 2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.hindustanpetroleum.com/ పరిశీలించగలరు.