ANGRAU Recruitment : అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంలోని రీజినల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి డ్రోన్ ఇంజినీర్ కమ్ ట్రైనర్ 2 ఖాళీలు, యంగ్ ప్రొఫెషనల్ అగ్రికల్చర్ 1 ఖాళీ, డ్రోన్ పైలెట్ 1ఖాళీ, డ్రోన్ కో పైలెట్ కమ్ డ్రైవర్ 1 ఖాళీ, ఫీల్డ్ అసిస్టెంట్ కమ్ అటెండర్ 1 ఖాళీ ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదోతరగతి, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్ లైన్ ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా 10 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://angrau.ac.in/ పరిశీలించగలరు.