SSC JE Recruitment : కేంద్రం ఆధ్వర్యంలోని పలు శాఖల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి శాఖల వారీగా ఆయా విభాగాల్లో సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ విభాగాల్లో డిప్లొమా/ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులకు వయసులో కొంత సడలింపు ఉంటుంది.

Junior Engineer posts

SSC JE Recruitment : కేంద్రం ఆధ్వర్యంలోని పలు శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1324 జూనియర్ ఇంజినీర్ నియామకాలను చేపట్టనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : HAL Recruitment : హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి శాఖల వారీగా ఆయా విభాగాల్లో సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌ విభాగాల్లో డిప్లొమా/ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులకు వయసులో కొంత సడలింపు ఉంటుంది.

READ ALSO : Rare And Strange fruits : పోషకాల మెండు .. ప్రపపంచలోనే విచిత్రమైన,ఆశ్చర్యపరిచే పండ్లు,వాటి విశేషాలు

ఈ ఉద్యోగాల్లో నియామకమైనవారు దేశంలోని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, విభాగాల్లో గ్రూప్ – బీ నాన్ మినిస్టీరియల్ జూనియర్ ఇంజినీర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. CWC, CPWD, MES, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, BRO, CWPRS, నావల్ , NTRO వంటి కేంద్ర ప్రభుత్వ సంస్ధల్లో పనిచేయాల్సి ఉంటుంది.

READ ALSO : Bans Import Laptops : ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై ఆంక్షలు.. విదేశాల్లో కొనుగోలు చేసిన వాటిని మీవెంట తెచ్చుకోవాలంటే ఇలా చేయాలి

అభ్యర్ధుల ఎంపికకు గాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు వేతనంగా సెవెన్త్ పే స్కేల్ ప్రకారం 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలతో.. మొదటి నెల నుంచే 50 వేల నుంచి 55 వేల రూపాయల వరకు జీతంగా చెల్లిస్తారు.

READ ALSO : Kokapet : ఆల్‌టైం రికార్డు స్థాయిలో కోకాపేట భూముల వేలం

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు 16 ఆగస్టు 2023ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://ssc.nic.in పరిశీలించగలరు.