Paramedical Staff Recruitment
Paramedical Staff Recruitment : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 57 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్, యాంత్రిక్ పోస్టుల దరఖాస్తు గడువు పొడగింపు !
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి గైనకాలజిస్ట్: 01, అనస్థీటిస్ట్: 06, పీడియాట్రీషియన్: 01, ఫిజీషియన్: 04, జనరల్ సర్జన్: 01, కార్డియాలజిస్ట్: 01, మెడికల్ ఆఫీసర్: 16, స్టాఫ్ నర్స్: 20, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్- 210. ఆప్టోమెట్రిషియన్: 01, సోషల్ వర్కర్: 01, ల్యాబ్ టెక్నీషియన్: 01 , న్యూట్రిషన్ కౌన్సెలర్: 01, అటెండర్ కమ్ క్లీనర్: 01 ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Pests In kharif Rice : ఖరీఫ్ వరిలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులవారీగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంబీబీఎస్, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించకూడదు.
READ ALSO : Satyakumar : వైసీపీ ప్రభుత్వ బైజూస్ అవినీతి కూడా బయటకొస్తుంది.. ఆధారాలు సేకరించి కేసులు పెడతాం : సత్యకుమార్
దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఏలూరులోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.09.2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://eluru.ap.gov.in/ పరిశీలించగలరు.