Pests In kharif Rice : ఖరీఫ్ వరిలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

పెరుగుదల దశలో వున్న పైరులో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కాండంతొలుచు పురుగు. నారు మడి దశ నుండి కంకితయారయ్యే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించే ఈ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Pests In kharif Rice : ఖరీఫ్ వరిలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

pests in kharif rice

Pests In kharif Rice : ఖరీఫ్ వరసాగులో రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య చీడపీడలు. అవసరానికి మించి ఎరువుల వాడకం, వాతావరణ ప్రతికూలతలు, నీటిముంపు పరిస్థితుల్లో వివిధ రకాల పురుగులు పంటపై దాడిచేయటం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ప్రస్థుతం ఖరీఫ్ లో నాటిన వరిపైరు30 నుండి 60 రోజుల దశలో వుంది. నెల్లూరు జిల్లాలో ప్రస్థుతం ఎర్లీ రబీకింద వరినాట్లకు సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో ఖరీఫ్ వరిసాగులో చీడపీడలను సమర్థవంతంగా నివారించేందుకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఐ. పరమ శివ.

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట

తొలకరి వర్షాలు ఆందోళన రేకెత్తించినా… వరినాట్లు పడే సమయం నుండి వర్షపాతం ఆశాజనకంగా వుండటంతో ఖరీఫ్ వరిసాగు విస్తీర్ణం సాధారణం కంటే ఎక్కవ నమోదైంది. నెల్లూరు జిల్లాలో ఎడగారులో సాగుచేసిన వరిలో కోతలు పూర్తవుతుండగా, సెప్టెంబరులో నారుమళ్లు పోసిన రైతులు ప్రస్థుతం నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

READ ALSO : Integrated Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న.. చార్టర్డ్ అకౌంటెంట్

ఇతర జిల్లాల్లో పెరుగుదల దశలో వున్న పైరులో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కాండంతొలుచు పురుగు. నారు మడి దశ నుండి కంకితయారయ్యే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించే ఈ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వరిపైరు పొట్ట దశలో ఈ పురుగు ఆశిస్తే, తాలుకంకులు ఎక్కువచ్చి 5 నుండి 15 శాతం దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. రైతులు కాండంతొలుచు పురుగుపై నిఘా వుంచి, దీన్ని గుర్తించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఐ.పరమ శివ.

READ ALSO : Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు

వరిపైరు దుబ్బుచేసే దశ నుండి పైరు చిరుపొట్ట దశ వరకు ఆశించే మరో పురుగు ఆకుముడత. ఈ పురుగు ఆకులను మడతగా చుట్టి, లోపల దాగి వుండి పచ్చని పదార్థాన్ని గోకి తినేయటం వల్ల ఆకులు తెల్లగా మారితాయి. చిరుపొట్ట దశలో పోటాకుకు నష్టం కలిగించటం వల్ల దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీని నివారణ పట్లకూడా రైతులు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు డా. పరమశివ.