Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్, యాంత్రిక్ పోస్టుల దరఖాస్తు గడువు పొడగింపు !

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, అసెస్‌మెంట్‌ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్, యాంత్రిక్ పోస్టుల దరఖాస్తు గడువు పొడగింపు !

Navik and Yantrik posts

Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్, యాంత్రిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించారు. పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైసెప్టెంబరు 22తో దరఖాస్తు గడువు ముగిసింది. ఈ క్రమంలో దరఖాస్తు గడువును సెప్టెంబరు 27 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తులు సమర్పించని వారు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

READ ALSO : Pests In kharif Rice : ఖరీఫ్ వరిలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల వివరాలకు సంబంధించి నావిక్(జనరల్ డ్యూటీ): 260 , నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): 30 , యాంత్రిక్(మెకానికల్): 25 ,యాంత్రిక్(ఎలక్ట్రికల్): 20 ,యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్): 15 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టులకు ఇంటర్ (ఎంపీసీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక యాంత్రిక్ పోస్టులకు పదోతరగతితోపాటు ఇంజినీరింగ్ డిప్లొమా(ఎలక్ట్రికల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్) ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

READ ALSO : Supreme court: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. సీజేఐ ఏం చెప్పారంటే..

ఇక అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, అసెస్‌మెంట్‌ అడాప్టబిలిటీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదిగా 27.09.2023 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://joinindiancoastguard.gov.in/ పరిశీలించగలరు.