Medical Jobs : రంగారెడ్డి జిల్లా వైద్యశాఖలో మెడికల్ సిబ్బంది నియామకం

ఒప్పంద వ్యవధి ఏడాది కాలం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

Rangareddy Health Jobs

Medical Jobs : రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ సిబ్బంది నియామకం చేపట్టనుంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి మెడికల్‌ ఆఫీసర్లు 6ఖాళీలు, సైకాలజిస్ట్‌ 1, డీఈఐసీ మేనేజర్‌ 1, స్టాఫ్‌ నర్స్‌ 1, ల్యాబ్‌ టెక్నీషియన్‌ 1, ఫార్మసిస్ట్‌లు 2, సోషల్‌ వర్కర్‌ 1 ఖాళీ ఉన్నాయి. ఒప్పంద వ్యవధి ఏడాది కాలం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతల విషయానికి వస్తే మెడికల్‌ ఆఫీసర్లకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఏపీ,టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌ గుర్తింపు కలిగి ఉండాలి. సైకాలజిస్ట్‌కు పీజీ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ, డీఈఐసీ మేనేజర్‌కు ఎండీఆర్‌ఏ, స్టాఫ్‌ నర్స్‌కు జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సీంగ్‌,.. ల్యాబ్‌ టెక్నీషియన్‌కు ఇంటర్‌ మరియు డీఎంఎల్‌టీ, బీఎస్సీ ఎంఎల్‌టీ,.. ఫార్మసిస్ట్‌కు డీఫార్మసీ, బీఫార్మసీ,.. సోషల్‌ వర్కర్‌కు ఎంఎస్‌డబ్ల్యు,..ఏఎన్‌ఎంకు ఇంటర్‌ ఎంపీహెచ్‌ఏ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి వెయిటేజీ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అకడమిక్‌ ప్రతిభకు 90 మార్కులు, వయసుకు 10 మార్కుల వెయిటేజీ ఇస్తారు. దరఖాస్తులు అందజేసేందుకు చివరి తేదీ మే 9, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: rangareddy.telangana.gov.in పరిశీలించగలరు.