Recruitment of Office Subordinate Posts in Telangana High Court
Telangana High Court Recruitment : తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు ఏదైన పరీక్ష లేదా దాని సత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టుల దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
అభ్యర్ధులు దరఖాస్తులను అన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంంది. దరఖాస్తులకు చివరి తేదిగా ఫిబ్రవరి 11, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; tshc.gov.in పరిశీలించగలరు.