NHIT Recruitment : నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో పోస్టుల భర్తీ
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుసంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, బీకామ్, సీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్, ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేన్న తర్వాత అప్లికేషన్‌ను ఈమెయిల్ ద్వారా పంపించాలి.

NHIT Recruitment
NHIT Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 140 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, కోఆర్డినేటర్, మెయింటనెన్స్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ట్యాక్స్, ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుసంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, బీకామ్, సీఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్, ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేన్న తర్వాత అప్లికేషన్‌ను ఈమెయిల్ ద్వారా పంపించాలి.
ఎంపిక ప్రక్రియకు సంబంధించి మెరిట్ తోపాటు, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 07 మే 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nhai.gov.in/ పరిశీలించగలరు.