Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. నెలకు జస్ట్ రూ. 12,500 పెట్టుబడితో ఏకంగా రూ. 40 లక్షలు సంపాదించుకోవచ్చు..
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెడుతున్నారా? నెలకు రూ. 12,500 పెట్టుబడి పెట్టండి. ఎంత మొత్తం రాబడి వస్తుందంటే?

Post Office Scheme
Post Office Scheme : పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. పోస్టాఫీసులో అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలామంది (Post Office Scheme) తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. అందులోనూ సురక్షితంగా మంచి రాబడిని అందించే పెట్టుబడిపై ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఇలాంటి పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే పోస్టాపీసు పథకాల్లో పెట్టవచ్చు.
పోస్టాఫీస్ అందించే అన్ని పథకాల్లో చాలావరకూ మంచి రాబడిని అందిస్తాయి. అలాంటి పథకమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). తక్కువ-రిస్క్ ఉంటుంది. పన్ను-రహిత పెట్టుబడితో పాటు అధిక రాబడిని అందిస్తుంది. ఇందులో పెట్టుబడిపై 7 శాతం కన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సాధారణ పెట్టుబడి ద్వారా కూడా భారీ మొత్తంలో రాబడిని పొందవచ్చు.
7.1శాతం వడ్డీ, 15 ఏళ్ల లాక్-ఇన్ :
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కింద కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు 7.1శాతం వార్షిక పన్ను రహిత వడ్డీని అందిస్తోంది. ఈ ప్రభుత్వ పథకం అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. పీపీఎఫ్‌లో పెట్టుబడి 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. పెట్టుబడిపై అందుకున్న వడ్డీ కూడా పన్ను కట్టాల్సిన పనిలేదు. మెచ్యూరిటీపై పొందిన మొత్తం కూడా పన్ను ఉండదు. ఈ పథకంలో లాక్-ఇన్ వ్యవధి 15 ఏళ్లు ఉంటుంది.
రూ. 500 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు :
భారత ప్రభుత్వమే పోస్టాఫీస్ పీపీఎఫ్ పథకంలో పెట్టుబడిపై భద్రతకు హామీ ఇస్తుంది. కేవలం రూ. 500 పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. పీపీఎఫ్ పథకంలో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. 15 ఏళ్ల లాక్-ఇన్ వ్యవధి తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించాలంటే ప్రతి 5 ఏళ్లకు పొడిగించవచ్చు.
Post Office Scheme : రూ. 40 లక్షల ఫండ్ పొందొచ్చు :
పెట్టుబడిదారులు ఈ పథకం ద్వారా 15 ఏళ్ల మెచ్యూరిటీతో రూ. 40 లక్షలకు పైగా ఫండ్ పొందవచ్చు మీరు ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. మీ ఆదాయం నుంచి ప్రతి నెలా రూ. 12,500 ఆదా చేసుకోవాలి.
15 ఏళ్ల పాటు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చెల్లిస్తే.. మీ మొత్తం డిపాజిట్ రూ. 22,50,000 అవుతుంది. 7.1 శాతం వడ్డీ రేటు పడుతుంది. మీరు దీనిపై రూ. 18,18,209 గ్యారెంటెడ్ ప్రాఫిట్ కూడా పొందుతారు. ఈ మెచ్యూరిటీ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 40,68,209 అవుతుంది. మీ సౌకర్యాన్ని బట్టి పెట్టుబడి మొత్తాన్ని ఇంకా పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు.
రుణంతో ముందుగానే విత్‌డ్రా :
పీపీఎఫ్ (PPF) కింద ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పెట్టుబడిపై రుణ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ప్రారంభ పెట్టుబడిపై ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే రుణం కోసం అప్లయ్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 5 ఏళ్ల తర్వాత PPF అకౌంట్ నుంచి విత్‌డ్రా సౌకర్యాన్ని పొందవచ్చు. మీరు 2020-21లో అకౌంట్ ఓపెన్ చేస్తే 2026-27 తర్వాత విత్ డ్రా చేయవచ్చు.
Disclaimer : ఈ పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పోస్టాఫీసులో ఏదైనా పెట్టుబడి పెట్టేముందు మీకు దగ్గరలోని ఆఫీసుకు వెళ్లి సంప్రదించండి.