Raibareli AIIMS : రాయబరేలి ఎయిమ్స్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష , పని అనుభవం అధారంగా అభ్యర్ధుల ఎంపి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 500, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

Raibareli AIIMS

Raibareli AIIMS : ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయబరేలిలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 111 టెక్నీషియన్లు, పారా మెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరపనున్నారు.

READ ALSO : Rainy Season Spicy Food : వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా..? వెరీ ఇంట్రెస్టింగ్

పోస్టుల ఖాళీల వివరాలకు సంబంధించి క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ 3, ఆడియో మెట్రీ టెక్నీషియన్ 1, సీఎస్ఎస్ డీ టెక్నీషియన్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 4, ఈసీజీ ల్యాబ్ టెక్నీషియన్ 2, ఈఈజీ ల్యాబ్ టెక్నీషియన్ 1, ఐసీయూ టెక్నీషియన్ 5, ఓటీ టెక్నీషియన్ 5, ఆప్టోమెట్రిస్ట్ 2, పెర్ఫ్యూషనిస్ట్ 2, ఫిజియోధెరపిస్ట్ 2, రేడియాలజీ టెక్నీషియన్ 25, స్పీచ్ థెరపిస్ట్ 3, ట్రామా ఎమర్జెన్సీ టెక్నీషియన్ 5, ల్యాబ్ టెక్నీషియన్ 47, మానిఫోల్డ్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Urinary Tract Infection : వర్షాకాలంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా పాటించాల్సిన 7 చిట్కాలు !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష , పని అనుభవం అధారంగా అభ్యర్ధుల ఎంపి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 500, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు

READ ALSO : Respiratory Infections : వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ !

నియామకం 1 సంవత్సర కాలానికి ఒప్పంద ప్రాతిపదికన చేయబడుతుంది. అభ్యర్థులు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు. పరీక్ష 06.08.23న నిర్వహించబడుతుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదిగా జులై 31, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.aiimsrbl.edu.in