BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రొబేషనరీ ఉద్యోగ ఖాళీల భర్తీ

నెలకు రూ.40,000-రూ.1,40,000. జీతభత్యాలక్రింద చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 28.10.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.

BEL Recruitment

BEL Recruitment : భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు,కార్యాలయాల్లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో జనరల్-96, ఓబీసీ-62, ఎస్సీ-34, ఎస్టీ-17, ఈడబ్ల్యూఎస్-23 కేటాయించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Nara Lokesh: ప్ర‌జ‌లారా.. జ‌గ‌న్‌కి ఇచ్చిన ఒక్క చాన్స్‌తో ఏమేమి కోల్పోయారో గుర్తించండి: నారా లోకేశ్

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌/ మెకానికల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌, ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ/ పీజీ డిప్లొమా, సీఏ/ సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 సంవత్సరాలకు మించరాదు.

READ ALSO : Shocking Video : అడవిలో వీడియో షూట్, నీటిలో నిలబడిన వ్యక్తిపై పడిన పిడుగు

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలోని సంస్ధ యూనియట్లలో ఉద్యోగ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.40,000-రూ.1,40,000. జీతభత్యాలక్రింద చెల్లిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 28.10.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.