BSF Recruitment : సరిహద్దు భద్రతా దళంలో ఆర్వో, ఆర్ఎం హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.25500 నుంచి రూ.81100 చెల్లిస్తారు.

Border Security Force

BSF Recruitment : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో హెడ్‌ కానిస్టేబుల్‌(ఆర్‌వో/ఆర్‌ఎం) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి హెడ్‌ కానిస్టేబుల్‌ రేడియో ఆపరేటర్‌ 982 పోస్టులు, హెడ్‌ కానిస్టేబుల్‌ రేడియో మెకానిక్‌ 330 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదో తరగతి, ఇంటర్మీడియట్ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథ్స్‌), ఐటీఐ(రేడియో అండ్‌ టెలివిజన్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌, డేటా ప్రిపరేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, జనరల్‌ ఎలక్ట్రానిక్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫిట్టర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌, కమ్యూనికేషన్‌ ఎక్వి‌ప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్క్‌ టెక్నీషియన్‌, మెకాట్రానిక్స్‌)పూర్తి చేసిన వారు అర్హులు. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.25500 నుంచి రూ.81100 చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబరు 19గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://bsf.gov.in/ పరిశీలించగలరు.