ICAR Recruitment : ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన, బోధన అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు 52 సంవత్సరాలు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 47 సంవత్సరాలకు మించరాదు.

ICAR Recruitment : ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ

ICAR Recruitment

Updated On : August 10, 2023 / 1:40 PM IST

ICAR Recruitment : దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలోని పలు పరిశోధన సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

READ ALSO : YS Sharmila: షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపిందెవరు.. విలీనానికి అంతా సిద్ధమా?

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య 368 ఉన్నాయి. వీటిలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ 80 పోస్టులు, సీనియర్ సైంటిస్ట్ 288 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Vitamin D : విటమిన్ డి లోపంతో డిప్రెషన్‌ సమస్యకు గురికావాల్సి వస్తుందా?

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన, బోధన అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు 52 సంవత్సరాలు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 47 సంవత్సరాలకు మించరాదు. దరఖాస్తు ఫీజుగా రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

READ ALSO : Delhi Man Quits Job : ఆఫీస్ దూరమైందని మొదటిరోజే జాబ్‌కు రిజైన్.. సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందనతో కంగుతిన్న యువకుడు..

విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు రూ.1,44,200 – రూ.2,18,200. సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు రూ.1,31,400 – రూ.2,17,100. నెలకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతలున్నవారు 2023 సెప్టెంబర్‌ 8లోగా దరఖాస్తుకు తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.asrb.org.in/