Recruitment of Senior Resident Vacancies in Government Medical and Dental Colleges in Andhra Pradesh
Recruitment Of Senior Resident : ఆంధ్రప్రదేశ్‌లో డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కాలేజీల్లో 49 స్పెషాలిటీల్లో సీనియర్ రెసిడెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్/ రేడియాలజీ,ఎమెర్జెన్సీ మెడిసిన్, డెంటిస్ట్రీ/ డెంటల్ సర్జరీ, రేడియోథెరపీ, తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్/ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్) ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వ మెడికల్ & డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు. వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు. పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్ రూ.85,000; రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ(పీజీ) రూ.70,000; రెసిడెంట్ డెంటిస్ట్ పీజీ రూ.65,000 ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీగా నవంబర్ 19, 2022.ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://dme.ap.nic.in/