TG Medical Department: టీజీ వైద్యశాఖలో 1623 జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.1.37 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 1623 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల(TG Medical Department) భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

TG Medical Department: టీజీ వైద్యశాఖలో 1623 జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.1.37 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

Notification released for 1623 posts in TG Medical Department

Updated On : August 22, 2025 / 7:48 PM IST

TG Medical Department: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 1623 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో TVVPలో అనస్థీషియా, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, సర్జరీ, కంటి, ఈఎన్టీ, రేడియాలజీ, పాథాలజీ, చర్మ వ్యాధులు, ఫోరెన్సిక్ మెడిసిన్ సైకియాట్రీ, లంగ్స్ వంటి విభాగాల్లో పోస్టులు ఖాళీగా(TG Medical Department) ఉన్నాయి. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8న మొదలై సెప్టెంబర్ 22తో ముగియనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Mega DSC : మెగా డీఎస్సీ మెరిట్ జాబితా.. మంత్రి నారా లోకేశ్ కీలక సూచనలు.. అలా మోసపోవద్దు..

విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత స్పెషలిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా/DNB పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.

వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 46 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే రిజర్వేషన్ల ప్రకారం సడలింపులు కూడా ఉన్నాయి.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ200 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, BC, EWS, PH, మాజీ సైనికులు, నిరుద్యోగ యువతకు మినహాయింపు ఉంటుంది.

వేతన వివరాలు: ఈ ;పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,500 నుంచి రూ1,37,050 వరకు జీతం అందుతుంది.