ITBP JOBS : ఐటీబీపీలో సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

Itbp Jobs

ITBP JOBS : ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ITBP)లో గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా 37 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు32, స్త్రీలు5 ఖాళీలు కేటాయించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌, రాతపరీక్ష, డాక్యుమెంటేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు16 జులై 2022 నుండి ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదిగా ఆగస్ట్ 14,2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://itbpolice.nic.in/ పరిశీలించగలరు.