Railway Recruitment : భుసవ‌ల్ రైల్వే డివిజ‌న్‌ రైల్వే స్కూల్‌లో టీచింగ్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ,ఎమ్మెస్సీ,మాస్టర్స్‌ డిగ్రీ, ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌లో రెండేళ్ల డిప్లొమా, బీఈఐఈడీ,బీఏ, బీఎస్సీ, బీఏఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి.

Railway Recruitment : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌రైల్వేలో భాగమైన భుసవ‌ల్ రైల్వే డివిజ‌న్‌లోని రైల్వే స్కూల్‌లో పలు టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, ఎక‌నామిక్స్, మ్యూజిక్‌, సైన్స్‌, ఆర్ట్స్ త‌దిత‌ర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ,ఎమ్మెస్సీ,మాస్టర్స్‌ డిగ్రీ, ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌లో రెండేళ్ల డిప్లొమా, బీఈఐఈడీ,బీఏ, బీఎస్సీ, బీఏఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి. టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,250ల నుంచి రూ.27,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఈ అర్హతలున్నవారు సంబంధిత డాక్యుమెంట్లతో అక్టోబర్‌ 4, 2022వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bhelpssr.co.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు