Western Coalfields
WCL Recruitment : వెస్ట్రన్ వెస్ట్రన్ కోల్‌ఫీల్ట్స్ లిమిటెడ్ నాగ్‌పూర్‌లోని డబ్ల్యూసీఎల్‌కి చెందిన వివిధ ప్రాంతాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 875 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డబ్ల్యూసీఎల్ ప్రాంతాలైన బల్లార్‌పూర్, చంద్రాపూర్, వాణి నార్త్, వాణి, మజ్రీ, ఉమ్రేర్, నాగ్‌పుర్, పెంచ్, కన్హన్, పఠాఖేరా, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : YouTube Videos Removal: క్యాన్సర్ చికిత్సపై తప్పుడు వీడియోలు.. యూట్యూబ్ కీలక నిర్ణయం
ఐటీఐ ట్రేడ్ లకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సర్వేయర్, మెకానిక్ డీజిల్, వైర్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), పంప్ ఆపరేటర్ అండ్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ విభాగాల్లో 815 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెక్యూరిటీ గార్డ్ 60 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతితోపాటు సరైన అర్హత గల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
READ ALSO : Flowers in worship : పువ్వులను తుంచి పూజ చేయకూడదు .. ఎందుకో తెలుసా?
దరఖాస్తుల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7700 నుంచి రూ.8050 ఫ్రెషర్లకు రూ.6000. చెల్లిస్తారు. వయోపరిమితి 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా 16.09.2023 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.westerncoal.in/ పరిశీలించగలరు.