AAI Recruitment : ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, బీ.కమ్, బీఈ, బీటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 27 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, పర్సరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Airport Authority of India
AAI Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 342 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ, బీ.కమ్, బీఈ, బీటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 27 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, పర్సరల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 31,000 నుంచి రూ. 1,40,000 వరకు చెల్లిస్తారు.
READ ALSO : Walking : మోకాలి నొప్పులతో బాధపడేవారు వాకింగ్ చెయ్యెచ్చా ?
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 05వ తేదీన ప్రారంభమై సెప్టెంబ్ 4వ తేదీతో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aai.aero/ పరిశీలించగలరు.