BSF Recruitment : సరిహద్దు భద్రతా దళంలో పలు పోస్టుల భర్తీ

రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), డాక్యుమెంటేషన్‌, మెడికల్‌ ఎగ్జామ్‌లకు ఎంపికచేస్తారు. హెడ్‌కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌) అభ్యర్థులు డిక్టేషన్‌, పారాగ్రాఫ్‌ రీడింగ్‌ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఆ తర్వాతే వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

Border Security Force

BSF Recruitment : దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో 1312 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌) 982, హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌) 330 ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తుదారులు పదో తరగతి, ఐటీఐ పాసై ఉండాలి. రేడియో అండ్‌ టెలివిజన్‌/ ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ /డేటా ప్రిపరేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌/జనరల్‌ ఎలక్ట్రానిక్స్‌/డేటా ఎంట్రీ ఆపరేటర్‌/ ఎలక్ట్రీషియన్‌/ ఫిట్టర్‌ /ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌/ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌/కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌/నెట్‌వర్క్‌ టెక్నీషియన్‌/ మెకట్రానిక్స్‌ కోర్సు పాసై ఉండాలి. లేదా ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించాలి.

రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), డాక్యుమెంటేషన్‌, మెడికల్‌ ఎగ్జామ్‌లకు ఎంపికచేస్తారు. హెడ్‌కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌) అభ్యర్థులు డిక్టేషన్‌, పారాగ్రాఫ్‌ రీడింగ్‌ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఆ తర్వాతే వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఓబీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులు, బీఎస్‌ఎఫ్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.75 శాతం ఖాళీలను నేరుగా భర్తీ చేస్తారు. 25 శాతం ఖాళీలను బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నవారితో భర్తీ చేస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీగా 19 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ :https.bsf.gov.in పరిశీలించగలరు.