Eastern Railway (2)
Eastern Railway : ఈస్ట్రన్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 2972 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డివిజన్ల వారీగా భర్తీ చేయనున్న అప్రెంటీస్ ఖాళీలను పరిశీలిస్తే హౌరా డివిజన్ 659 పోస్టులు,లిలుహ్ డివిజన్ 612 పోస్టులు , సీల్దా డివిజన్ 297 పోస్టులు, కంచరపర డివిజన్ 187 పోస్టులు, మాల్డా డివిజన్ 138 పోస్టులు, అసన్సోల్ డివిజన్ 412 పోస్టులు, జమాల్‌పూర్ డివిజన్ 667 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈస్టన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు NCVT,SCVT జారీ చేసిన నిర్దేశిత ట్రేడ్‌లో జాతీయ TED సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. SC,ST,PWBD,మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై మే 10, 2022 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.rrcer.com పరిశీలించగలరు.