Esi
Esi Jobs : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్యూరెన్స్ లో డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 151 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేయాలనుకునే వారికి డిగ్రీ ఉత్తీర్ణతతోపాటుగా, సంబంధిత పనిలో మూడేళ్ళ అనుభవం కలిగి ఉండాలి. వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
ఇక ఎంపిక విధానానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పరీక్ష విషయానికి వస్తే ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం అబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. పార్ట్ ఎ లో ఇంగ్లీష్, పార్ట్ బి లో జనరల్ ఎబిలిటీ ఉంటుంది. పరీక్ష సమయం రెండుగంటలు.
ప్రశ్నాపత్రంలో ఆబ్జెక్టీవ్ టైప్ లో అడిగే అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఇస్తారు. అయితే పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ పట్నం లో మాత్రమే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ధరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే జరుగుతుంది. ధరఖాస్తు ఫీజును 25 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. ధరఖాస్తులకు చివరి తేదిగా సెప్టెంబర్ 2 ను నిర్ణయించారు.