Npcil
NPCIL : ముంబయిలోని అణుశక్తినగర్ న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 225 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు
కోరుతున్నారు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే గేట్ 2020, 2021, 2022 మెరిట్ స్కోరు , పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక
చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. ఏప్రిల్ 13 నుండి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభం అవుతుంది. దరఖాస్తులు పంపేందుకు ఏప్రిల్ 28, 2022 చివరి గడువుతేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్
www.npcilcareers.in/ సంప్రదించగలరు.