Jobs (1)
BPCL JOBS : భారత ప్రభుత్వ రంగ సంస్ధ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎకౌంట్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ , సీఏ, సీఎంఏ ఉత్తీర్ణలై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
అభ్యర్ధుల వయస్సు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీగా ఆగస్టు 8, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.bharatpetroleum.in పరిశీలించగలరు.