Telangana Judicial Services : తెలంగాణ జ్యూడీషియల్ సర్వీసెస్ లో పోస్టుల భర్తీ

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన శాఖ Judicial Services లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎంట్రీ లెవల్ జిల్లా జడ్జిల ఖాళీ

Ts Jobs

Telangana Judicial Services : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన శాఖ జ్యూడీషియల్ సర్వీసెస్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎంట్రీ లెవల్ జిల్లా జడ్జిల ఖాళీలు ఉన్నాయి. మొత్తం 13 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే వారి అర్హతలకు సంబంధించి ఏడు సంవత్సరాలకు తగ్గకుండా అడ్వేకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న వారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష, వైవా ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్షకు సంబంధించి మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులు. పరీక్షలో అర్హత సాధించిన వారిని వైవా వాయిస్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మెరిట్ మార్కుల అధారంగా తుది ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు మే 2, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం, జనరల్ అడ్మినిస్ట్రేషన్ , బూర్గుల రామకృష్ణారావు భవన్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్ 500053,పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://tshc.gov.in/ పరిశీలించగలరు.