Coast Guard : ఇండియన్ కోస్ట్ గార్డ్ లో పోస్టుల భర్తీ

పోస్టుల వివరాల విషయానికి వస్తే జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలట్ ఎంట్రీ, టెక్నికల్ మెకానికల్, టెక్నికల్ ఎలక్ట్రికల్ , విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Indian Coast Guard (1)

Coast Guard : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ లో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 65 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ, పురుషులు దరఖాస్తులకు అర్హులే.

పోస్టుల వివరాల విషయానికి వస్తే జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలట్ ఎంట్రీ, టెక్నికల్ మెకానికల్, టెక్నికల్ ఎలక్ట్రికల్ , విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే అయా పోస్టులను అనుసరించి ఇంటర్వీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక విధానానికి సంబంధించి స్ర్కీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్, ఫైనల్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను అన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేది ఫిబ్రవరి 28గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://joinindiancoastfuard.cdac.in/