Ssc Ministerial Head Constable Posts
SSC JOB NOTIFICATION : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సీ) దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2022 ద్వారా పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మినిస్టీరియల్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు 835 ఉన్నాయి. వాటిలో పురుషులు 559 ఖాళీలు, మహిళలు 276 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇంటర్వీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తోపాటు, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్ మెంట్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, అధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు జూన్ 16, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ssc.nic.in/ పరిశీలించగలరు.