Jobs (2)
Job Notification : భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకుచెందిన మైసూర్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఏఐఐఎస్ హెచ్)లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వంటి పోస్టులు ఉన్నాయి.
క్లినికల్ , సైకాలజీ, అడియాలజీ, స్పీచ్ సైన్సెస్, స్పీచ్ పాధాలజీ, లాంగ్వేజ్ పాధాలజీ వంటి విభాగాలకు సంబంధించిన పోస్టులను భర్తీచేస్తున్నారు. ఇక అర్హత విషయానికి వస్తే సంబంధిత విభాగం పోస్టును అనుసరించి స్పెషలైజేషన్లో ఎంఏ , ఎమ్మెస్సీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించటంతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 40రూ, ఇతరులకు 100రూ, పిడబ్ల్యూడీ అభ్యర్ధులకు పీజు మినహాయింపు నిచ్చారు. ధరఖాస్తు చివరి తేది అక్టోబరు 08, వివరాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్ ; https://aiishmysore.in/en/
ధరఖాస్తులను పంపాల్సిన చిరునామా వివరాలు : ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, మానస గంగోత్రి, మైసూర్ 570006