Upsc Jobs
UPSC Posts : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఎడిటర్, ఫొటోగ్రఫిక్ ఆఫీసర్, సైంటిస్టులు, టెక్నికల్ ఆఫీసర్లు తదితర పోస్టులు ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, టాక్సికాలజీ, పబ్లిక్ రిలేషన్స్, గ్రౌండ్ వాటర్ బోర్డ్ తదితర విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎండీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మార్చి 31, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.upsc.gov.in/ సంప్రదించగలరు.