Jobs : రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టులు..నోటిఫికేషన్ విడుదల
రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిషికేషన్ విడుదలైంది. ఇది రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. మొత్తం 48 పోస్టులను భర్తీ చేయనుంది.
- madhu
- Published On : August 16, 2021 / 01:12 PM IST
Rites
RITES Recruitment : రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిషికేషన్ విడుదలైంది. ఇది రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. మొత్తం 48 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎలక్ట్రిక్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్ పోస్టులున్నాయి. అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి…ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవచ్చని, ఇందుకు గడువు 25 వరకు ఉందని అధికారులు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Read More : Afghanistan: అప్ఘాన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడతారా? వారి భవిష్యత్తు ఏంటి?
మొత్తం పోస్టులు 48. (సివిల్ ఇంజినీర్ 25, మెకానికల్ ఇంజినీర్ 15, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 8 పోస్టులు).
అర్హతలు : అభ్యర్థులు 32 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్)లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ. 600. ఎస్సీ, పీడబ్ల్యూడీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 300.
Read More : Congress : ఆర్ధిక ఇబ్బందుల్లో కాంగ్రెస్ .. ప్రతీ ఎంపీ పార్టీకి విరాళం ఇవ్వాలి
దరఖాస్తుకు చివరి తేదీ : ఆగస్టు 25.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
వెబ్‌సైట్ : http://www.rites.com.
