Afghanistan: అప్ఘాన్ క్రికెట‌ర్లు ఐపీఎల్‌లో ఆడ‌తారా? వారి భవిష్యత్తు ఏంటి?

అప్ఘాన్ క్రికెటర్ల భవితవ్యం గందరగోళంలో పడింది. రాబోయే ఐపీఎల్ టోర్నీలో వీరిద్దరు ఆడటం కష్టంగానే కనిపిస్తోంది.

Afghanistan: అప్ఘాన్ క్రికెట‌ర్లు ఐపీఎల్‌లో ఆడ‌తారా? వారి భవిష్యత్తు ఏంటి?

Rashid Khan And Mohammed Nabi's Ipl Participation

Rashid Khan and Mohammed Nabi : అప్ఘాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటివరకూ స్వేచ్చగా జీవించిన అక్కడి ప్రజలంతా తాలిబన్ల క్రూరపాలనలో చస్తూ బతకాల్సిందే. రెండు దశాబ్దాల పాటు అమెరికా సంకీర్ణ బలగాలు మోహరించాయి. ఇప్పుడు తిరిగి వెళ్లిపోవడంతో అప్ఘాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అలాగే క్రికెటర్లు కూడా స్వేచ్ఛగా తమ ఆటను కొనసాగించారు. అయితే తాలిబన్ల రాకతో అప్ఘాన్ క్రికెటర్లలో రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వంటి క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీరిద్దరూ ఐపీఎల్ టోర్నీలో ఆడుతారా? లేదా అనేది అనుమానంగా మారింది. వరల్డ్ క్లాస్ స్పిన్ బౌలర్ గా రషీద్ కు మంచి పేరుంది.

అప్ఘాన్ నుంచి వచ్చిన క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే నబీ కూడా అదే స్థాయిలో గుర్తింపును సాధించాడు. మునపటిలా ఇప్పుటి పరిస్థితులు లేవు. పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో అప్ఘాన్ క్రికెటర్ల భవితవ్యం గందరగోళంలో పడింది. రాబోయే ఐపీఎల్ టోర్నీలో వీరిద్దరు ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ స్టార్ క్రికెటర్లు ఇద్దరూ అప్ఘానిస్తాన్ లో లేరు. హండ్రెడ్ టోర్నీలో ఆడ‌టానికి యూకే వెళ్లారు. ర‌షీద్ ఖాన్ ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. న‌బీ లండ‌న్ స్పిరిట్స్‌కు ఆడుతున్నాడు. అయితే ఈ ఇద్దరు యూఏఈ నుంచి నేరుగా వచ్చి ఐపీఎల్ ఆడుతారా? లేదో క్లారిటీ లేదు. ఆ ఇద్దరూ ఐపీఎల్ ఆడతారనే నమ్మకం లేదంటోంది బీసీసీఐ.
Talibans income : కళ్లు చెదిరే తాలిబాన్ల ఆదాయం..అంత ఆర్థిక బలం ఎలా వస్తోందంటే..

ప్రస్తుతానికి వీరిద్దరి రాకపై ఎలాంటి కామెంట్ చేయలేమంటోంది. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. ఆగస్టు 21న హండ్రెడ్ టోర్నీ ముగియనుంది. అనంతరం రషీద్, నబీ యూకేలోనే ఉంటారా? లేదా క్లారిటీ రావాల్సి ఉంది. వారిద్దరూ అక్కడే ఉంటే మాత్రం.. మన క్రికెటర్లతో పాటు ఒకే విమానంలో ఐపీఎల్ కు తీసుకొచ్చే బీసీసీఐ ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు. ర‌షీద్‌, న‌బీ ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అప్ఘానిస్తాన్‌లో ప‌రిస్థితిపై అక్క‌డి క్రికెట్ బోర్డుతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది.

ఆగస్టు నెలలోనే అప్ఘానిస్తాన్‌ టీమ్ శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఆరు వైట్ బాల్ గేమ్స్ ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. అప్ఘాన్ టీ20 కెప్టెన్ గా రషీద్ వ్యవహరిస్తున్నాడు. రషీద్, నబీ, ముజీబ్ జార్దన్ అప్ఘాన్ క్రికెటర్లుగా ఐపీఎల్ జట్లలో ఆడుతున్నారు. ప్రపంచ టీ20 క్రికెటర్లలో రషీద్ పాపులర్ క్రికెటర్. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో తమ దేశాన్ని రక్షించాలంటూ రషీద్ ట్వీట్ చేశాడు.


ప్రియమైన ప్రపంచ నాయకులారా.. నా దేశం ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు, మహిళలు సహా వేలాది మంది అమాయక ప్రజలు ప్రతిరోజూ వీరమరణం పొందుతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నాయి. మమ్మల్ని గందరగోళంలో ఉంచవద్దు. ఆఫ్ఘన్లను చంపడం ఆపండి.. మాకు శాంతి కావాలి’ అంటూ రషీద్ కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేశాడు.