రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ కొన్ని రోజుల క్రితం 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ఎల్లుండితో ముగుస్తుండగా దాన్ని పొడిగించారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు 2025 జనవరి 23 నుంచి ప్రారంభమయ్యాయి.
ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని 2025 ఫిబ్రవరి 22గా నిర్ణయించారు. ఇప్పుడు ఈ గడువును 2025 మార్చి 1 పొడిగించారు. ఈ గ్రూప్ డీ పోస్టుల్లో 14 రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
జనరల్‌తో పాటు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగుల అభ్యర్థులకు రూ.250గా ఫీజు నిర్ణయించారు.
పోస్టులు ఇవే..
అర్హత వివరాలు
పదో తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ సర్టిఫికేషన్ లేదా తత్సమాన అర్హత, లేదా ఎన్‌సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (ఎన్‌ఏసీ). వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు.
ఎలా ఎంపిక చేస్తారు?
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)తో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు ఉంటాయి.
దరఖాస్తు విధానం